📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇంటికి తాళం వేసి వెళ్లారు.. తిరిగొచ్చేసరికి భారీ చోరీ !

ఇంటికి తాళం వేసి వెళ్లారు.. తిరిగొచ్చేసరికి భారీ చోరీ !

16 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ.. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు ! 

కామారెడ్డి, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): కామారెడ్డి విద్యుత్‌నగర్‌ కాలనీలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి తల్లి ఇంటికి వెళ్లిన ఆమె మరుసటి రోజు తిరిగి వచ్చేసరికి తలుపు గడియ విరగ్గొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపల బీరువా పగులగొట్టి ఉండటంతో పరిశీలించగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు కనిపించలేదు. ఈ ఘటనపై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫిర్యాదుదారు లావణ్య మామిండ్ల

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం విద్యుత్‌నగర్‌ కాలనీకి చెందిన మామిండ్ల లావణ్య, భర్త సురేశ్‌కుమార్‌, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆగస్టు 7న ఉదయం 8.30 గంటలకు ఇంటికి తాళం వేసి కామారెడ్డి విద్యానగర్‌ కాలనీలోని తల్లి ఇంటికి వెళ్లారు. ఆగస్టు 8న ఉదయం 10.30 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు గడియ పగులగొట్టి ఉంది. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటంతో పాటు బీరువా తాళం కూడా ధ్వంసం చేసినట్లు గుర్తించారు.

16 తులాల బంగారం..

చోరీకి గురైన వాటిలో రెండు బంగారు గొలుసులు 1.5 తులాలు, నల్లపూసల బంగారు గొలుసు 3 తులాలు, ఏడు ఉంగరాలు 2.5 తులాలు, బంగారు చెవి ఆభరణాలు 0.5 తులా, మూడు జతల చెవి దిద్దులు ఒక తులం ఉన్నాయి. రెండు బంగారు బిస్కెట్లు 5 తులాలు, నాలుగు బంగారు బిస్కెట్‌ ముక్కలు 2.5 తులాలు కలిపి మొత్తం సుమారు 16 తులాల బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే ఐదు జతల వెండి పట్టీలు సుమారు 20 తులాలు, ఒక వెండి బిస్కెట్‌ సుమారు 10 తులాలు, కొంత నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం చోరీ ఆస్తి విలువను సుమారు రూ.3.50 లక్షలుగా నమోదు చేశారు.

దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదు

లావణ్య ఇచ్చిన తెలుగు రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆగస్టు 8న కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 344/2026గా నమోదు చేసి బీఎన్‌ఎస్‌ 331(4), 305 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఫిర్యాదును స్వీకరించిన అనంతరం దేవునిపల్లి ఎస్‌ఐ  రంజిత్‌ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా గుర్తుతెలియని వ్యక్తులను పేర్కొన్నారు.

నిందితుల కోసం దర్యాప్తు

ఇంటి యజమాని అందుబాటులో లేని సమయంలో తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాను ధ్వంసం చేసి చోరీ చేసినట్లు ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి సంబంధించిన ఆధారాలు, నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!