📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మత్తు ముఠాను పసిగట్టిన ‘రోమా’..!

మత్తు ముఠాను పసిగట్టిన ‘రోమా’..!

స్నిఫర్ డాగ్ చాకచక్యంతో గంజాయి స్వాధీనం.. కేసు నమోదు..

ఆదిలాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):

 

ఆదిలాబాద్ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ప్రత్యేక శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్ ‘రోమా’ కీలక పాత్ర పోషించింది. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధంగర్ మహల్లాలో ఓ ఇంట్లో దాచిపెట్టిన నాలుగు గంజాయి పొట్లాలను రోమా పసిగట్టడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం షేక్ మదార్ కుమారుడు షేక్ వాజిద్ ఇంట్లో సుమారు 15 గ్రాముల గంజాయి దాచి ఉంచినట్లు గుర్తించారు. స్నిఫర్ డాగ్ ఇచ్చిన సంకేతాలతో ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి విక్రయం, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల వ్యాపారంపై కఠిన చర్యలు తప్పవని, అనుమానాస్పద సమాచారం ఉంటే డయల్-112 లేదా 8712659973 వాట్సాప్ నంబర్‌కు తెలియజేయాలని సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!