📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆగస్టు 15లోగా 13,046 వ్యవసాయ కుంటలు పూర్తి చేయాలి

ఆగస్టు 15లోగా 13,046 వ్యవసాయ కుంటలు పూర్తి చేయాలి

అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం

వీబీ-జీ రామ్-జీ, తెలంగాణ జలసిరి, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPSAP) అమలుపై సమీక్షించిన ఆయన, ప్రతి గ్రామ పంచాయతీలో వ్యవసాయ కుంటల గుర్తింపు, పరిపాలనా అనుమతులు, పనుల ప్రారంభాన్ని వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.

జిల్లాలకు కీలక ఆదేశాలు

• ఆగస్టు 15లోగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణం పూర్తి చేయాలి.
• ప్రతి జిల్లాలో కనీసం 50 ఎకో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేయాలి.
• తెలంగాణ జలసిరి కింద వ్యవసాయ కుంటలు, సోక్‌పిట్స్, పర్కొలేషన్ ట్యాంకులు, బోర్‌వెల్ రీఛార్జ్, బావుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ

పనుల పురోగతిని వేగవంతం చేసేందుకు అధికారులు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, మండల స్థాయి సమీక్షలు చేపట్టి లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని దాన కిషోర్ ఆదేశించారు.

అలాగే గ్రామ పంచాయతీల మూడేళ్ల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక (GPSAP) తయారీకి అవసరమైన వివరాలను గ్రామాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!