📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆగస్టు 5న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేత ..

ఆగస్టు 5న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేత ..

మియాపూర్, చందానగర్, హఫీజ్‌పేట్ సహా పలు ప్రాంతాలకు ఆరు గంటల అంతరాయం..

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 5 (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. మంజీరా తాగునీటి సరఫరా వ్యవస్థలో భాగమైన కలబ్‌గూర్ సబ్‌స్టేషన్‌లో 33 కేవీ అవుట్‌డోర్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ (VCB) ఏర్పాటు, నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) వెల్లడించింది.

ఈ ప్రాంతాల్లో ప్రభావం

  • ఆర్‌సీ పురం
  • అశోక్‌నగర్
  • జ్యోతినగర్
  • లింగంపల్లి
  • చందానగర్
  • హఫీజ్‌పేట్
  • మదీనగూడ
  • మియాపూర్
  • బీరంగూడ
  • అమీన్‌పూర్
  • భాగ్యనగర్ కాలనీ
  • బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీ
  • బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్
  • హెచ్‌సీవీ
  • ఇండస్ట్రియల్ ఏరియా బల్క్ కనెక్షన్లు

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

తాగునీటి సరఫరా నిలిచిపోనున్న నేపథ్యంలో వినియోగదారులు అవసరమైన మేరకు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని వాటర్ బోర్డు సూచించింది. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!