గుర్జకుంట – బస్వాపూర్ శివారులో యాంటీ థెఫ్ట్ పరికరాల ఏర్పాటు.. దొంగతనాల నివారణకు విద్యుత్ శాఖ చర్యలు…
బిక్కనూరు, ఆగస్టు 3 (నవజ్యోతి ప్రతినిధి):
బిక్కనూరు మండలంలోని గుర్జకుంట, బస్వాపూర్ శివారులో ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్ చోరీలు పునరావృతం కావడంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా సోమవారం ట్రాన్స్‌ఫార్మర్లకు ప్రత్యేక యాంటీ థెఫ్ట్ పరికరాలను ఏర్పాటు చేసింది.
గత నెల రోజులుగా వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురికావడంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలను పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టగా, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.
ట్రాన్స్‌ఫార్మర్ల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రత్యేక యాంటీ థెఫ్ట్ పరికరాలను అమర్చినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గుర్జకుంట గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ గొల్ల సంతోష్, విద్యుత్ శాఖ ఏఈ బాలాజీ, గ్రామస్థులు పాల్గొన్నారు.

