📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homecinemaసర్దార్ 2 టీజర్ విడుదల.. కార్తీకి విలన్‌గా ఎస్.జే. సూర్య !

సర్దార్ 2 టీజర్ విడుదల.. కార్తీకి విలన్‌గా ఎస్.జే. సూర్య !

సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న స్పై యాక్షన్ థ్రిల్లర్..

 

కార్తీ హీరోగా, పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్

‘సర్దార్ 2’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 2022లో వచ్చిన
‘సర్దార్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం
సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

టీజర్‌లో కార్తీ మరోసారి గూఢచారి పాత్రలో కనిపిస్తుండగా,
ప్రముఖ నటుడు ఎస్.జే. సూర్య శక్తివంతమైన క్రిమినల్ ఆర్గనైజేషన్
నాయకుడిగా కనిపిస్తూ కథలో ప్రధాన ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు.
ఇద్దరి మధ్య సాగే పోరాటం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఈ చిత్రంలో మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రాజిషా విజయన్,
యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సామ్ సీఎస్ సంగీతం అందించగా, సినిమాను ప్రిన్స్ పిక్చర్స్,
ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎస్. లక్ష్మణ్ కుమార్,
ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు.

తెలుగు టీజర్

నవజ్యోతి తెలుగు దినపత్రిక 2026 | ALL RIGHTS ARE RESERVED

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!