📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeమెదక్భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయి పనులను పర్యవేక్షించిన చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు.

భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయి పనులను పర్యవేక్షించిన చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాలతో రంగంలోకి దిగిన మున్సిపల్ యంత్రాంగం.

జెసిబిలు,శానిటేషన్ సిబ్బందితో మురుగు కాలువల శుభ్రపరిచే పనులు

3వ వార్డులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నిల్వ నీటి తొలగింపు.

రామాయంపేట,జూలై 30 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :

రామాయంపేట పట్టణంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు వార్డుల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా  3వ వార్డులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో గత కొన్ని రోజులుగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను గుర్తించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు కౌన్సిలర్ గుగులోత్ రవితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జేసీబీ సహాయం తో నిల్వ ఉన్న నీటిని తొలగించడం,గుంతలను పూడ్చడం, మురుగు కాలువల్లో అడ్డంకులను తొలగించే పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తున్నామని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు చింతల యాదగిరి,కౌన్సిలర్ గుగులోతు రవి,యాదగిరి,మిషన్ భగీరథ సిబ్బంది, శానిటరీ జవాన్లు ప్రవీణ్, రమేష్, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!