సంగారెడ్డి, జూలై 28 (నవజ్యోతి న్యూస్) : సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన 282 మంది బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) సమావేశం జూలై 29, బుధవారం సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఎల్‌ఏలతో నేరుగా సమావేశమై బూత్‌ల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల వివరాలు, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై సమీక్షించి కీలక సూచనలు చేయనున్నారు. ప్రతి బీఎల్‌ఏ తమ బూత్‌కు సంబంధించిన పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ సాయంత్రం 4 గంటలలోపు సమావేశ ప్రాంగణానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన బీఎల్‌ఏ తప్పనిసరిగా సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

