📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyబీబీపేట్‌కు వెటర్నరీ ఆస్పత్రి మంజూరు చేసిన షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు!

బీబీపేట్‌కు వెటర్నరీ ఆస్పత్రి మంజూరు చేసిన షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు!

హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారును కలిసిన సర్పంచ్

 

హైదరాబాద్, జూలై 19 (నవజ్యోతి ప్రతినిధి):

బీబీపేట్ మండలానికి రూ.17.50 లక్షల వ్యయంతో నూతన వెటర్నరీ ఆస్పత్రిని మంజూరు చేయించడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్‌ను బీబీపేట్ గ్రామ సర్పంచ్ సాధ్విక సాయినాథ్ ఆదివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

ఈ సందర్భంగా బీబీపేట్ మండలంలో పశుసంవర్ధక సేవలు మరింత మెరుగుపడేలా వెటర్నరీ ఆస్పత్రి మంజూరుకు కృషి చేసినందుకు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో మండలంలోని పశుపోషకులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!