📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్బతుకు జట్కా బండి పేరుతో మహిళపై అత్యాచారం

బతుకు జట్కా బండి పేరుతో మహిళపై అత్యాచారం

హైదరాబాద్, నవజ్యోతి ప్రతినిధి టి రాజగోపాల్ :

హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది వరకట్నం వేధింపులు సమస్యను ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం బతుకు జట్కబండి ద్వారా పరిష్కరిస్తామని సదరు మహిళను నమ్మబలికి ఆ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బాధితురాలు టెలివిజన్ కార్యక్రమం కార్యాలయాన్ని వెతుక్కుంటూ హైదరాబాదుకు వచ్చింది పంజాగుట్టలో కార్యాలయం దొరకక సికింద్రాబాద్ చేరుకున్న ఆమెకు ఇద్దరు వ్యక్తులు సహాయం చేస్తామని నమ్మించారు అనంతరం ఆమెను రాణిగంజ్ లోని ఓ వాణిజ్య సముదాయానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు బాధితురాలు ఫిర్యాదు మేరకు మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వివరించారు ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని వారు తెలిపారు మహిళలను మోసపూరితంగా నమ్మించి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహంకాళి పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని వారు మీడియాకు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!