📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణనల్గోండఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహణ – జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్‌తో సందడి

నవజ్యోతి ప్రతినిధి టి. రాజగోపాల్, ఆత్మకూరు, జూలై 7 :

 

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల అధ్యక్షుడు నద్దునూరి రఘు మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి, సంస్థ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అలాగే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను సైతం ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్ గత 32 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ఉద్యమ లక్ష్యాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రేవూరి జలంధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత దయ్యాల శ్యామ్ మాదిగ మాజీ మండల అధ్యక్షులు మంద రవి మాదిగ ఎం ఆర్ పి ఎస్ మండల కార్యదర్శి వేల్పుల గణేశ్ ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు, సంగే మహేందర్ మాదిగ (దళిత రత్న అవార్డు గ్రహీత), బరుపట్ల కిరీటి, తనుగుల సందీప్ మాదిగ (వార్డు సభ్యులు తనుగుల సునీత మాదిగ, మంద విజయ మాదిగ,) పెరుమండ్ల శ్రీను మాదిగ, హర్షం సుధాకర్ మాదిగ (మండల ఉపాధ్యక్షుడు), హర్షం అనిల్ మాదిగ (నీరుకుళ్ల గ్రామ శాఖ అధ్యక్షుడు), హర్షం పవన్ మాదిగ (సోషల్ మీడియా అధ్యక్షుడు)తో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!