రామాయంపేట జూలై 5 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డు కోమటిపల్లి తండాలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ జగదాంబ అమ్మవారి, సేవాలాల్ మహారాజు దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతల ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగదాంబ అమ్మవారి,సేవాలాల్ మహారాజు కృపతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక కమిటీ సభ్యులను అభినందించిన ఆమె, భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేవుని రంజిత్, గుగులోత్ రవి, వైస్ ప్రెసిడెంట్ చింతల యాదగిరి, జిల్లా కార్యదర్శి పొచమ్మల గణేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు డాకి స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల స్వామి, మట్టి యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు చిలుక విరాట్, నరేష్, సాయి తేజ, నితిన్ గౌడ్, సోహెల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు

