సంగారెడ్డి, జూలై 2 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ఉద్యమకారుల భూపోరాట కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ కలబ్గూర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. హైదరాబాద్ సమీపంలోని బొల్లిగూడెం, బోడుప్పల్ ప్రాంతాల్లో నిర్వహించిన భూపోరాటంలో పోలీసులు విధించిన ఆంక్షలను అధిగమించి ఉద్యమకారులు పాల్గొని తమ ఉద్యమ స్ఫూర్తిని చాటారు.

ఈ సందర్భంగా కలబ్గూర్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారి సంక్షేమానికి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వేణు మాధవ్, గోపాల్ రెడ్డి, చంద్రిక కరుణాకర్, కృష్ణ, నితిన్ ఆనంద్ యాదవ్, మనోజ్ రెడ్డి, నరసింహ రెడ్డి, కృష్ణన్ రెడ్డి తదితర ఉద్యమకారులు, నాయకులు పాల్గొన్నారు.

