గుజరాత్‌లో జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌లో బెస్ట్ డిజైన్, బెస్ట్ డెకరేషన్ పురస్కారాలు
గుజరాత్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): గుజరాత్‌లో ఆగస్టు 6 నుంచి 8 వరకు జరిగిన మూడు రోజుల ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్)లో తెలంగాణ టూరిజం బెస్ట్ డిజైన్, బెస్ట్ డెకరేషన్ అవార్డులను గెలుచుకుంది. ఈ ప్రదర్శనలో 2 దేశాలు, 18 రాష్ట్రాలు, 1,300 స్టాళ్లు పాల్గొనగా.. దేశ, విదేశాలకు చెందిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు సహా దాదాపు 16 వేల మంది పాల్గొన్నారు.
తెలంగాణ టూరిజానికి అవార్డులు
తెలంగాణ టూరిజం తరఫున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా టూరిజం అధికారి ఎస్. ప్రభాకర్ అవార్డులను అందుకున్నారు. టీటీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ ఆయనకు పురస్కారాలను అందజేశారు.

