📄 ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కరెంటు వైర్లను అల్లుకున్న చెట్లు.. అధికారుల నిర్లక్ష్యం!

కరెంటు వైర్లను అల్లుకున్న చెట్లు.. అధికారుల నిర్లక్ష్యం!

తోపుచర్ల, గునిరెడ్డిగూడెంలో ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు.. వర్షాకాలంలో పొంచి ఉన్న ముప్పు

మాడుగులపల్లి, ఆగస్టు 22 (నవజ్యోతి ప్రతినిధి):

మండలంలోని తోపుచర్ల, గునిరెడ్డిగూడెం గ్రామాల్లో విద్యుత్‌ వైర్లు, స్తంభాలకు
చెట్లు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి.
వర్షాకాలం కావడంతో చెట్ల కొమ్మలు విద్యుత్‌
వైర్లను తాకుతున్నాయని, దీంతో తరచూ షార్ట్‌సర్క్యూట్‌ జరిగే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్‌ స్తంభాలకు అల్లుకున్న చెట్ల కొమ్మల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు,
ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షం
కురిసే సమయంలో చెట్లు తడిసి విద్యుత్‌ వైర్లను తాకితే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలుమార్లు చెప్పినా.. పట్టించుకోలేదని ఆరోపణ

సమస్యపై సంబంధిత విద్యుత్‌ శాఖ అధికారులకు ఇప్పటికే రెండు, మూడు సార్లు సమాచారం అందించి,
విద్యుత్‌ వైర్లకు అల్లుకున్న చెట్ల కొమ్మలను తొలగించాలని కోరినప్పటికీ ఇప్పటివరకు చర్యలు
తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే అధికారులు సమస్యను పరిష్కరించాలని,
విద్యుత్‌ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని వారు కోరుతున్నారు.


విద్యుత్‌ వైర్ల చుట్టూ చెట్ల పంజా..
వర్షాకాలంలో ప్రమాదం ముప్పు!

వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి తోపుచర్ల, గునిరెడ్డిగూడెం గ్రామాల్లో విద్యుత్‌ వైర్లకు
అల్లుకున్న చెట్లను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముందస్తు చర్యలు తీసుకుని
విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా చూడాలని
విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!