📄 ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జాతీయ రహదారి 44 పై రోడ్డు ప్రమాదం!

జాతీయ రహదారి 44 పై రోడ్డు ప్రమాదం!

కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌.. 30 నిమిషాల్లో క్లియర్‌ చేసిన తూప్రాన్‌ పోలీసులు.. ఎస్‌ఐ గంగరాజుకు వాహనదారుల కృతజ్ఞతలు

తూప్రాన్, ఆగస్టు 21 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):

తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
నాగులపల్లి హల్దీవాగు బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది.
ఈ ఘటనలో డీసీఎం ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన డీసీఎం

తూప్రాన్‌ ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులపల్లి హల్దీవాగు బ్రిడ్జి వద్ద లారీ ఆగి ఉంది.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం లారీని ఢీకొట్టింది.
దీంతో డీసీఎం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా.. ప్రాణాపాయం తప్పింది.

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

రెండు భారీ వాహనాలు రహదారి మధ్యలో నిలిచిపోవడంతో 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.
దీంతో రాత్రి సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

30 నిమిషాల్లో ట్రాఫిక్‌ క్లియర్‌

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే తూప్రాన్‌ ఎస్‌ఐ గంగరాజు తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు.
రహదారి మధ్యలో ఉన్న వాహనాలను తొలగించి.. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా
సుమారు 30 నిమిషాల్లో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

రాత్రి సమయంలో ట్రాఫిక్‌ సమస్యను త్వరగా పరిష్కరించి రాకపోకలను పునరుద్ధరించడంతో
వాహనదారులు తూప్రాన్‌ ఎస్‌ఐ గంగరాజు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!