రామాయంపేట, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్): రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో పర్వతాపూర్ పాఠశాల పనులకు శ్రీకారం చుట్టారు.
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం
గ్రామ సర్పంచ్ తార్య నాయక్ ఆధ్వర్యంలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ప్రహరీ గోడ పూర్తయితే విద్యార్థులకు భద్రతతో పాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సిబ్బంది
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తార్య నాయక్, ఉపసర్పంచ్ కట్ట ఈశ్వర్, సెక్రటరీ లక్ష్మీ, పీఆర్ఏఈ సల్మాన్, హెచ్‌ఎం చందన, ఉపాధ్యాయులు మాధవి, కాముని సంతోష్, దప్పు స్వామి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

