ప్రధాని మోదీ పిలుపు మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
కామారెడ్డి, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన క్యాంపు కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నేటి తరానికి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

