📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్డీజీపీ ఆనంద్‌ సంచలన వ్యాఖ్యలు !

డీజీపీ ఆనంద్‌ సంచలన వ్యాఖ్యలు !

‘ఎంత చెప్పినా నలుగురు అధికారులు పద్ధతి మార్చుకోవట్లేదు.. ఇక ఏం చేయాలో చూస్తాం’’

హైదరాబాద్‌, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ పోలీస్‌ శాఖలోని నలుగురు అధికారుల తీరుపై డీజీపీ సీవీ ఆనంద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్మీట్ లో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పలుమార్లు సూచించినా ఆ నలుగురు అధికారులు తమ పద్ధతిని మార్చుకోవడం లేదని పేర్కొన్నారు.

పలుమార్లు చెప్పినా మార్పులేదు

వీడియో కాన్ఫరెన్స్‌, టెలికాన్ఫరెన్స్‌లలో పలుమార్లు చెప్పి చూశామని, అయినా వారి వ్యవహారశైలిలో మార్పు రావడం లేదని డీజీపీ స్పష్టం చేశారు.

‘‘తదుపరి ఏం చేయాలో చూస్తాం’’

‘‘పద్ధతి మార్చుకోకపోతే తదుపరి ఏం చేయాలో చూస్తాం’’ అని హెచ్చరించారు. డీజీపీ వ్యాఖ్యలు పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ నలుగురు అధికారులు ఎవరనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. వారి తీరులో మార్పు రాకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!