
వ్యవసాయ పొలాలను టార్గెట్ చేసి బోర్ మోటార్ కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న
నలుగురు సభ్యుల ముఠాను బిక్కనూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
రాత్రివేళ పొలాల్లోకి చొరబడి కేబుళ్లను కట్ చేసి, పెట్రోల్‌తో కాల్చి కాపర్ తీగలను వేరు చేసి స్క్రాప్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
🚔 రైతుల పొలాలే టార్గెట్
ఉగ్రవాయి, బస్వాపూర్ శివారు, అంతంపల్లి శివార్లలో బోర్ మోటార్ కేబుల్ వైర్లను ఈ ముఠా దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.
అంతంపల్లిలో వ్యవసాయ గది తాళాన్ని ఇనుప రాడ్‌తో పగులగొట్టి, కట్టర్లతో స్టార్టర్ కేబుళ్లు, బోర్ మోటార్ వైర్లను కట్ చేసినట్లు వెల్లడించారు.
బస్టాండ్ వద్ద పోలీసులకు చిక్కిన ముఠా
సెప్టెంబర్ 5న దొంగిలించిన కాపర్ తీగలను స్క్రాప్ షాపులో విక్రయించి డబ్బును పంచుకున్న నిందితులు.. బిక్కనూరు ప్రాంతంలో మరిన్ని బోర్ మోటార్ కేబుళ్లు దొంగిలించేందుకు వెళ్తుండగా బస్టాండ్ వద్ద పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు.
భిక్కనూరు CI నరేశ్, SI అనిల్, CCS కామారెడ్డి, భిక్కనూరు పోలీసు సిబ్బంది కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
🔎 కట్టర్లు.. ఇనుప రాడ్.. కాపర్ తీగలు స్వాధీనం
నిందితుల వద్ద నుంచి పోలీసులు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కోర్టులో హాజరు.. రిమాండ్‌కు తరలింపు
అరెస్టు చేసిన నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచి
జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
దొంగతనాల ఛేదనలో చురుకుగా వ్యవహరించిన CI నరేశ్, SI అనిల్, CCS కామారెడ్డి, బిక్కనూరు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
రైతులకు పోలీసుల సూచన
బోర్ మోటార్లు, కేబుల్ వైర్లకు భద్రత కల్పించాలని పోలీసులు రైతులకు సూచించారు.
— నవజ్యోతి ప్రతినిధి

