కుత్బుల్లాపూర్, జూలై 9 :(నవజ్యోతి ప్రతినిధి): జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం మధ్యాహ్నం సుమారు 12:36 గంటల సమయంలో సిగ్నల్ వ్యవస్థ ఉన్నప్పటికీ, వాహనదారులు నిబంధనలు పాటించకుండా రెండు దిశల నుంచి ఇష్టానుసారంగా ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
ఈ పరిస్థితి కారణంగా ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ కనిపించడం లేదని, బహదూర్‌పల్లి వంటి కీలక కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాలని వారు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకుని ప్రమాదాలను నివారించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

