చెత్త గుట్టల నుంచి.. చర్యల బాటలోకి..!
నాలా పనులు పూర్తయితేనే.. సమస్యకు ఫుల్‌స్టాప్!
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 5 (నవజ్యోతి ప్రతినిధి):
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఎస్‌వీ కో-ఆపరేటివ్‌లో పేరుకుపోయిన చెత్త, ఓపెన్ నాలాలు, పారిశుద్ధ్య సమస్యలపై నవజ్యోతి ప్రచురించిన
“ఎస్‌వీ కో-ఆపరేటివ్‌లో చెత్త రాజ్యం.. పాలన ఎక్కడ?”
కథనానికి స్పందన కనిపించింది. సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లడంతో నాలా పనులపై కదలిక మొదలైనట్లు తెలుస్తోంది.

టెండర్లు పూర్తయ్యాయి.. పనులు ఎప్పుడు?
నాలా పనులకు గతంలోనే టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. దీంతో
పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పటిలోగా పూర్తవుతాయి?
అన్నదే ఇప్పుడు స్థానికుల ప్రశ్న.
టెండర్లు పూర్తయ్యాయనే మాటతో సరిపెట్టకుండా.. పనులు వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
శాశ్వత సమస్యకూ పరిష్కారం కావాలి
నాలా పనులతో పాటు రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించి, పారిశ్రామికవాడలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య మరింత తీవ్రం కాకముందే ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
నవజ్యోతి కథనంతో అధికారుల్లో కదలిక కనిపించింది..
కానీ ఆ కదలిక శాశ్వత పనుల రూపంలో కనిపించినప్పుడే ప్రజలకు నిజమైన ఉపశమనం.
ఇప్పుడు ప్రజల ప్రశ్న ఒక్కటే..
టెండర్లు పూర్తయ్యాయి.. మరి నాలా పనులు ఎప్పుడు పూర్తవుతాయి?
— నవజ్యోతి ప్రతినిధి