📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి!

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి!

భిక్కనూరులో టీజీవీపీ ధర్నా.. రూ.15 వేల కోట్ల పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే చెల్లించాలని డిమాండ్‌
రూ.15,000 కోట్లు
పెండింగ్‌ ఉందని ఆరోపణ
టీజీవీపీ ధర్నా
భిక్కనూరు మండల కేంద్రంలో
అసెంబ్లీ ముట్టడి
డిమాండ్‌ నెరవేరకపోతే హెచ్చరిక

భిక్కనూర్‌, ఆగస్టు 31 (నవజ్యోతి ప్రతినిధి):
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్‌ (టీజీవీపీ) ఆధ్వర్యంలో భిక్కనూర్‌ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని సంజయ్‌ విమర్శించారు. విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

స్కాలర్‌షిప్‌లను ఎత్తివేసే ఆలోచన ఉంటే ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

‘అసెంబ్లీని ముట్టడిస్తాం’

పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని భిక్కనూర్‌ గడ్డ నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని సంజయ్‌ అన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.

పాల్గొన్న నాయకులు

కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండీ సమీర్‌ ఖాన్‌, మండల అధ్యక్షుడు భరత్‌ రాజ్‌, మండల ఉపాధ్యక్షుడు విజయ్‌, మండల మహిళా ఉపాధ్యక్షురాలు అంకిత, కళాశాల అధ్యక్షురాలు షిరిన్‌, ఉపాధ్యక్షురాలు మహాలక్ష్మితో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!