📄 ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్యువ ప్రతిభకు వెండితెర వేదిక!

యువ ప్రతిభకు వెండితెర వేదిక!

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌–2026 పోస్టర్‌ ఆవిష్కరణ.. విజేతలకు రూ.3 లక్షల వరకు నగదు బహుమతులు

హైదరాబాద్‌, ఆగస్టు 22 (నవజ్యోతి ప్రతినిధి):

తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పండుగలు, కళారూపాలు, ప్రభుత్వ కార్యక్రమాలను సృజనాత్మకంగా
తెరపైకి తీసుకువచ్చే యువ ప్రతిభకు మరో వేదిక సిద్ధమైంది. తెలంగాణ ఫిల్మ్‌
డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ‘బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌–2026
సీజన్‌–2’
పోటీలను నిర్వహించనున్నారు.

పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు శనివారం
ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్‌ డైరెక్టర్‌
రాజ్‌ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్‌ బాబులతో కలిసి
ఆవిష్కరించారు. యువ ఫిల్మ్‌ మేకర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దిల్‌ రాజు
కోరారు.

షార్ట్‌ ఫిలింస్‌.. పాటలు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌ వీడియోలు

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, బతుకమ్మ సహా పండుగలు, జానపద కళారూపాలు, రాష్ట్ర ప్రభుత్వ
పథకాలపై షార్ట్‌ ఫిలింలు, పాటల పోటీలు నిర్వహించనున్నారు. ఈసారి కొత్తగా
జానపద పాటలు, ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలు, వ్యాసాలు కూడా
పోటీల్లో చేర్చారు.

తెలంగాణ జీవన విధానం, సంప్రదాయాలు, సంస్కృతిని యువత దృష్టితో సృజనాత్మకంగా ఆవిష్కరించేందుకు
ఈ పోటీలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

సినీ రంగంలో అవకాశాలకు బాట

క్రియేటివ్‌ డైరెక్టర్‌ రాజ్‌ కొండా మాట్లాడుతూ ఈ పోటీలు యువతలోని
సృజనాత్మకతకు వేదికగా నిలవడంతో పాటు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు
ఉపయోగపడతాయని అన్నారు. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండుగలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న
కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు.

నిబంధనలు ఇవే

షార్ట్‌ ఫిలిం నిడివి 3 నిమిషాలకు మించకూడదు. పాటల నిడివి
5 నిమిషాల్లోపు ఉండాలి. వీడియోలు తప్పనిసరిగా 4కే రిజల్యూషన్‌లో
ఉండాలని నిర్వాహకులు తెలిపారు.

ఆసక్తి ఉన్నవారు తమ ఎంట్రీలను 2026 సెప్టెంబర్‌ 15లోపు
youngfilmmakerschallenge@gmail.com
కు ఈమెయిల్‌ ద్వారా లేదా 8125834009 వాట్సాప్‌ నంబర్‌కు పంపాలి.
అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేయనుంది.

🏆 బహుమతుల వివరాలు
🥇 ప్రథమ బహుమతి — రూ.3 లక్షలు
🥈 ద్వితీయ బహుమతి — రూ.2 లక్షలు
🥉 తృతీయ బహుమతి — రూ.1 లక్ష
మరో 5 మందికి — రూ.20 వేల చొప్పున కన్సోలేషన్‌ బహుమతి

ప్రతిభకు నగదు బహుమతులతో పాటు గుర్తింపు

విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించనున్నారు.
యువ ఫిల్మ్‌ మేకర్లు, కంటెంట్‌ క్రియేటర్లు, గాయకులు, రచయితలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ
ప్రతిభను చాటుకునేందుకు ఈ పోటీలు మంచి అవకాశంగా నిలవనున్నాయి.


బతుకమ్మ స్ఫూర్తి.. తెలంగాణ కథ..
యువత సృజనాత్మకతకు వెండితెర వేదిక!
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!