లక్ష్మాపూర్, కాట్రియాల్‌లో ఘనంగా జయంతి వేడుకలు
రామాయంపేట,ఆగస్టు 18 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) :
రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాల్ గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో పాపన్న గౌడ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన పోరాటాలను, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు.
అణగారిన వర్గాల కోసం నిలబడి, అన్యాయానికి ఎదురు తిరిగి పోరాడిన పాపన్న గౌడ్ స్ఫూర్తిని ప్రతి గ్రామస్తుడు ఆదర్శంగా తీసుకోవాలని గౌడ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. హక్కుల కోసం ఐక్యంగా నిలబడితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు తెలియజేసేలా యువత ముందుకు రావాలని కోరారు.
గ్రామాల్లో గౌడ సంఘాల ఐక్యతను మరింత బలోపేతం చేసుకుని, సామాజిక సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడాలని నాయకులు అన్నారు. పాపన్న గౌడ్ చూపిన ధైర్యం, తెగువ, పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాపన్న గౌడ్‌కు ఘన నివాళులర్పించారు..

