📄 ePaper
Wednesday, August 19, 2026
📄 ePaper
Homeమెదక్బీజేపీ పోరాటం ఫలించింది.. ఎంపీ రఘునందన్‌రావు చొరవకు అభినందనలు

బీజేపీ పోరాటం ఫలించింది.. ఎంపీ రఘునందన్‌రావు చొరవకు అభినందనలు

ప్రమాదాలకు చెక్‌.. వై జంక్షన్‌ పూర్తిస్థాయి మూసివేత : బిజెపి నేతలు 

రామాయంపేట,ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) : 

రామాయంపేట నేషనల్‌ హైవే-44పై వై జంక్షన్‌ వద్ద వరుసగా జరుగుతున్న ప్రమాదాల నివారణకు కీలక చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణలో భాగంగా వై జంక్షన్‌ను పూర్తిస్థాయిలో సోమవారం నాడు మూసివేయడంపై బీజేపీ రామాయంపేట నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా జంక్షన్‌ వద్ద ప్రమాదాలను నివారించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో అధికారులకు పలుమార్లు వినతులు అందజేసి, జంక్షన్‌ మూసివేతతో పాటు శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ఈ సమస్యను మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ప్రత్యేకంగా దృష్టిలోకి తీసుకుని నేషనల్‌ హైవే అధికారులతో మాట్లాడి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఎంపీ చొరవతో అధికారులు స్పందించి వై జంక్షన్‌ను పూర్తిగా మూసివేయడం ప్రజల భద్రతకు కీలక చర్యగా పేర్కొన్నారు.

బీజేపీ చేసిన సుదీర్ఘ పోరాటానికి ఇది విజయమని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు అన్నారు. నేషనల్‌ హైవేపై ప్రజల భద్రతకు అవసరమైన శాశ్వత చర్యలను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ప్రజల ప్రాణాలే ప్రథమం.. ప్రమాదాల నివారణే బీజేపీ లక్ష్యం అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!