సంగారెడ్డి, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి) : సంగారెడ్డి పట్టణంలోని మాణిక్య ప్రభు మందిరం ఆలయ నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చీఫ్ అడ్వైజర్ గా తోపాజి అనంత కిషన్, అధ్యక్షునిగా అమేటి కృష్ణ (కిట్టు) ప్రధాన కార్యదర్శి గా కొవ్వూరు హనుమంతు, కోశాధికారిగా నాయి కోటి నాగరాజు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, అశోక్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్ గౌడ్, కొండాపురం జగన్ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా పరమేశ్వర్ గౌడ్, గుండ్లపల్లి నరేష్ కుమార్, సహాయ కా దర్శులుగా నామ శ్రీనివాస్, అమేటి రాజేంద్ర ప్రసాద్,గౌరవ అధ్యక్షులుగా ఆమెటి మహేందర్, సలహాదారులుగా మిఠాయి నారాయణ, ఆమెటి ప్రభులింగం, కొంపల్లి విద్యా సాగర్, పంపాటి కృష్ణ మూర్తి, ప్రహ్లాద్, అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా సురేష్, బలవంతరావు, ర్యాకల సంతోష్ కుమార్, కాంశెట్టి శంకర్, శంకర్, వెంకట్, మధు, పెంటయ్య, అనుముల సంతోష్, శేఖర్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు ఆమెటి కృష్ణ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కార్యవర్గ సభ్యులు పూర్తిస్థాయిలో కృషి చేస్తారని చెప్పారు.
మాణిక్ ప్రభుఆలయ కమిటీ అధ్యక్షునిగా ఆమేటి కిట్టు..!
RELATED ARTICLES

