– భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు
కొత్లాపూర్, ఆగస్టు 16 (నవజ్యోతి ప్రతినిధి) : కొత్లాపూర్ గ్రామంలో ఆదివారం నాభి శిల ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాభి శిల ప్రతిష్ఠాపన సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక, పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ పద్ధతిలో ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామ ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కార్యక్రమం సందర్భంగా కొత్తలాపూర్ గ్రామంలో సందడి నెలకొంది.

