📄 ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మూడేళ్ల బాలుడి అద్భుత సాహసం.. 79 కి.మీ. స్కేటింగ్‌ !

మూడేళ్ల బాలుడి అద్భుత సాహసం.. 79 కి.మీ. స్కేటింగ్‌ !

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మదనపల్లె నుంచి కదిరి వరకు ప్రయాణం..

అన్నమయ్య జిల్లా, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లాకు చెందిన మూడేళ్ల బాలుడు దక్షిత్‌ అరుదైన సాహసం చేశాడు. ఏకంగా 79 కిలోమీటర్ల దూరాన్ని స్కేటింగ్‌ చేస్తూ పూర్తి చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

కురబలకోట మండలం చేనేతనగర్‌కు చెందిన దక్షిత్‌ శుక్రవారం ఉదయం మదనపల్లె నుంచి జాతీయ జెండాను చేతబట్టి స్కేటింగ్‌ ప్రయాణాన్ని ప్రారంభించాడు. సాయంత్రానికి శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చేరుకుని 79 కి.మీ. ప్రయాణాన్ని పూర్తి చేశాడు.

కోచ్‌ పర్యవేక్షణలో శిక్షణ

కోచ్‌ ప్రతాప్‌ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న అనంతరం దక్షిత్‌ ఈ సాహసయాత్ర చేపట్టాడు. ప్రయాణంలో గైడ్‌ సహకారం కూడా అందించారు. మార్గమధ్యలో బాలుడి స్కేటింగ్‌ను చూసిన పలువురు స్థానికులు, ప్రజలు ఆగి ప్రోత్సహించారు.

బాలుడిపై అభినందనల వెల్లువ

ఇంత చిన్న వయసులోనే పట్టుదల, క్రీడా ప్రతిభను ప్రదర్శించి జాతీయ జెండాతో 79 కి.మీ. స్కేటింగ్‌ పూర్తి చేయడం పట్ల బాలుడిని పలువురు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!