📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper

అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు…

రామాయంపేట, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):

రామాయంపేట మున్సిపాలిటీలో ఆదివారం బోనాల పండుగ సందర్భంగా బీజేపీ నాయకులు పట్టణంలోని వివిధ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.

 

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.

 

పాల్గొన్న బీజేపీ నాయకులు

కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు పబ్బ సత్యనారాయణ, ఓబీసీ మోర్చా బీజేపీ మెదక్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శేఖర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌. అశోక్‌, యువ నాయకులు అరవింద్‌, బండారి చిన్నాగౌడ్‌, బండి యాదగిరి, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!