బోనం ఎత్తి అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి శ్రీనివాస్..
కామారెడ్డి, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి పట్టణంలోని 38, 30, 40 వార్డుల్లో ఆషాఢ మాస మైసమ్మ సహిత పోచమ్మ బోనాల ఉత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పట్టణం సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్, కో-ఆప్షన్ సభ్యురాలు గొనె సునీత శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, నాయకులు సుకుమార్, సంజీవ్, శ్రీకాంత్, శ్రీనివాస్, నర్సింలు, కిరణ్‌తో పాటు వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

