📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తల్లిదండ్రులకు చోటు లేని ఇళ్లు... మనసుల్లోనైనా ఉందా..?

తల్లిదండ్రులకు చోటు లేని ఇళ్లు… మనసుల్లోనైనా ఉందా..?

వైరల్ వీడియోతో మరోసారి తెరపైకి వృద్ధుల నిర్లక్ష్యం…

హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):

తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపించడం, చివరి రోజుల్లో వారికి అండగా నిలవకపోవడం వంటి అంశాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. హర్యానాకు చెందినదిగా ప్రచారం జరుగుతున్న ఓ వీడియోలో, వృద్ధాశ్రమంలో ఉన్న తండ్రి మరణించిన తర్వాత కూడా కూతురు స్వయంగా రాకుండా వీడియో కాల్‌లో “और कितना टाइम लगेगा? ( ఎంత సమయం పడుతుంది )” అని ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కుటుంబ బంధాలు, వృద్ధుల పట్ల బాధ్యతపై నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ పోస్టుల ప్రకారం, పిల్లల కోసం జీవితాంతం కష్టపడిన ఆ తండ్రి చివరకు ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనే జీవితం ముగించుకున్నట్లు పేర్కొంటున్నారు. అంతిమ సంస్కారాల సమయంలో కూడా కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమే కనిపించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన పలువురు, తల్లిదండ్రుల త్యాగాలకు ఇదేనా ప్రతిఫలమని ప్రశ్నిస్తున్నారు.

అయితే, ఈ ఘటన హర్యానాలో జరిగిందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే విషయంపై అధికారిక ధృవీకరణ ఇప్పటివరకు వెలువడలేదు. అంతేకాదు, ఇటీవలి కాలంలో వృద్ధాశ్రమాల నేపథ్యంలో వైరల్ అయిన పలు వీడియోలు స్క్రిప్టెడ్‌గా రూపొందించినవేనని ఫ్యాక్ట్‌చెక్ సంస్థలు వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ వీడియోకు సంబంధించిన వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉంది.

అయినప్పటికీ, ఈ వీడియో లేవనెత్తిన ప్రశ్న మాత్రం ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేస్తోంది. తల్లిదండ్రులు పిల్లల కోసం జీవితాన్ని అంకితం చేస్తే, వారి వృద్ధాప్యంలో ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఇవ్వాల్సిన బాధ్యత పిల్లలదే. డబ్బు, ఉద్యోగం, బిజీ జీవితాల కంటే బంధాల విలువ గొప్పదని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!