📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భిక్షు యాదవ్ ఇకలేడు..!

భిక్షు యాదవ్ ఇకలేడు..!

వెండితెరపై భయపెట్టిన విలన్‌కు శాశ్వత వీడ్కోలు

తెలుగు, హిందీ, తమిళ చిత్రసీమలో తన విలక్షణమైన ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ముంబైలో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

‘భిక్షు యాదవ్’గా చిరస్థాయిగా గుర్తింపు

తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్ రావత్ అంటే ముందుగా గుర్తొచ్చేది దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంలోని భిక్షు యాదవ్ పాత్రే. ఆ పాత్రతో ఆయన ప్రతినాయకుడిగా చెరగని ముద్ర వేశారు.

విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు

ప్రదీప్ రావత్ అనంతరం ఛత్రపతి, ఘజిని, సరైనోడు, నాన్నకు ప్రేమతో తదితర చిత్రాల్లో శక్తివంతమైన విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు. హిందీలో లగాన్, సర్ఫరోష్ చిత్రాలతో పాటు బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారత్ ధారావాహికలో అశ్వత్థామ పాత్ర ద్వారా కూడా విశేష గుర్తింపు పొందారు.

చిత్రసీమకు తీరని లోటు

మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించిన ప్రదీప్ రావత్ తన గంభీరమైన స్వరం, హావభావాలు, సహజ నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఓ ప్రతిభావంతమైన నటుడిని కోల్పోయిందని సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!