📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆడపిల్లలు... పైలెట్‌ కావాలని ఉందా!?

ఆడపిల్లలు… పైలెట్‌ కావాలని ఉందా!?

ఉచిత కమర్షియల్ పైలట్ శిక్షణకు తెలంగాణ ప్రభుత్వం–ఇండిగోరీచ్ అవకాశం.. అర్హులైన యువతులు దరఖాస్తుకు సిద్ధం కండి..

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువతులు పైలట్‌గా ఎదగాలనే కలను సాకారం చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఇండిగో సంస్థ సామాజిక సేవా విభాగం ఇండిగోరీచ్ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎంపికైన యువతులకు పూర్తిగా ఉచితంగా కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) శిక్షణ అందించనున్నారు.

శిక్షణ వ్యవధి: 20 నెలలు
అందించే సౌకర్యాలు: కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL), ఏటీఆర్ టైప్ రేటింగ్, వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్‌షిప్, కెరీర్ గైడెన్స్ – పూర్తిగా ఉచితం.

ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఇండిగోరీచ్ తరఫున భారత్‌కేర్స్ (ఎస్‌ఎంఈసీ ట్రస్ట్) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన భారతీయ యువతులు కమర్షియల్ పైలట్లుగా ఎదిగే అవకాశాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

మహిళలకు కొత్త అవకాశాలు

ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, యువతులకు విమానయాన రంగంలో కెరీర్ అవకాశాలు కల్పించే దిశగా ఇది కీలక ముందడుగని తెలిపారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విమానయాన రంగంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. వెబినార్లు, అవగాహన సదస్సులు, కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమాల ద్వారా అర్హులైన విద్యార్థినులను దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!