మృత ఏఆర్ కానిస్టేబుల్ చరణ్ కుమార్ కుటుంబానికి అండగా తెలంగాణ పోలీస్…
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్ కుమార్ (పీసీ-8968) కుటుంబ సభ్యులకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు. మల్కాజిగిరి కమిషనరేట్‌కు చెందిన చరణ్ కుమార్ ఈగిల్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న సమయంలో 2025 సెప్టెంబరులో విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు.
సకాలంలో బీమా అందించిన అధికారులు
మృత కానిస్టేబుల్ కుటుంబానికి బీమా మొత్తం త్వరగా అందేలా ఈగిల్ ఫోర్స్ ఇన్చార్జి సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో ఎస్బీఐ అధికారులతో సమన్వయం చేసి అవసరమైన ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన అధికారులను డీజీపీ అభినందించారు.
కుటుంబానికి పోలీస్ శాఖ అండ
ఈ సందర్భంగా చరణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన డీజీపీ సీవీ ఆనంద్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చరణ్ కుమార్ ఇద్దరు చిన్నారులను చూసి హృదయం కలచివేసిందని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ పోలీస్ శాఖ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

