📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeజాతియంసీఆర్పీఎఫ్ దేశానికి భద్రతా కవచం: అమిత్ షా

సీఆర్పీఎఫ్ దేశానికి భద్రతా కవచం: అమిత్ షా

  • ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జవాన్లకు శుభాకాంక్షలు..
  • వీరమరణం పొందిన వారికి ఘన నివాళి

న్యూఢిల్లీ, జూలై 27 (నవజ్యోతి ప్రతినిధి):

కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దళంలోని అధికారులు, జవాన్లు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ అందిస్తున్న సేవలు అపూర్వమైనవని, దేశ ప్రజలకు ఈ దళం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

దేశ సమగ్రతను కాపాడడంలో, నక్సలిజం నిర్మూలనలో, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో, ఎన్నికల విధుల్లో, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో సీఆర్పీఎఫ్ విశేష పాత్ర పోషిస్తోందని అమిత్ షా కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తిస్తూ దేశ భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటున్న జవాన్ల సేవలు ప్రశంసనీయమని అన్నారు.

విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన సీఆర్పీఎఫ్ వీర జవాన్లకు అమిత్ షా ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, వారి కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. సాహసం, క్రమశిక్షణ, అంకితభావానికి ప్రతీకగా నిలిచిన సీఆర్పీఎఫ్ భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధతతో దేశ సేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా సీఆర్పీఎఫ్ సేవలను కొనియాడుతూ దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!