కుత్బుల్లాపూర్, జూలై 18: (నవజ్యోతి ప్రతినిధి)
పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి లోని అశోకా ఎ-లా మైసన్
*ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ కు తరలింపు *గేటెడ్ కమ్యూనిటీలో అర్ధరాత్రి చోటుచేసుకున్న వివాదం స్థానికంగా కలకలం రేపింది. కమ్యూనిటీలోని పార్కు స్థలంలో ఉన్న బోరుబావికి మరమ్మతులు చేపడుతున్న సమయంలో యాజమాన్య వివాదం తలెత్తడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
నివాసితుల ఆరోపణల ప్రకారం, మైనంపల్లి చందర్‌రావుతో పాటు మరికొందరు వ్యక్తులు పార్కు స్థలం తమదేనంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పనులను అడ్డుకున్నారు. అనంతరం సుమారు 120 బయట వ్యక్తులతో కలిసి కమ్యూనిటీలోకి ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించడంతో పాటు నివాసితులపై దాడికి యత్నించినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో మహిళలు, చిన్నారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పెట్ బషీరాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పలువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు తెలిసింది.
గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే ప్రజలకు భద్రతే ప్రధాన ఆకర్షణగా ఉండగా, ఇలాంటి ఘటనలు ఆ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని నివాసితులు అంటున్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని వారు పోలీసు అధికారులను కోరారు.

