📄 ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నకిలీ డాక్టర్‌ల గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్ !

నకిలీ డాక్టర్‌ల గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్ !

ఫేక్‌ సర్టిఫికెట్లతో వైద్యం.. మెడికల్‌ షాపు యజమాని కూడా అరెస్ట్

హైదరాబాద్‌, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి): నకిలీ డిగ్రీ, డాక్టర్‌ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న 11 మంది నకిలీ వైద్యులను, ఓ మెడికల్‌ షాపు యజమానిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం

కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, ఫేక్‌ డాక్టర్‌ సర్టిఫికెట్లను ఉపయోగించి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి డాక్టర్‌ పేర్లతో ఉన్న ప్రిస్క్రిప్షన్లు, రబ్బర్‌ స్టాంపులు, నకిలీ వైద్య ధ్రువపత్రాలు, వేలాది మందులు, గ్లూకోజ్‌ బాటిళ్లు, ఇతర వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రోజుకు 50 నుంచి 100 మంది రోగులకు చికిత్స

నిందితులు రోజుకు సుమారు 50 నుంచి 100 మంది రోగులకు వైద్యం అందిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.50 నుంచి రూ.200 వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సరైన వైద్య అర్హతలు లేకుండానే చికిత్స అందించడం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌లో ఆరుగురు.. జూబ్లీహిల్స్‌లో ఐదుగురు

ప్రత్యేక ఆపరేషన్‌లో సికింద్రాబాద్‌ జోన్‌లో ఆరుగురు, జూబ్లీహిల్స్‌ జోన్‌లో ఐదుగురు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిపై హైదరాబాద్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్లలో మొత్తం 11 కేసులు నమోదు చేశారు.

వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు

ముద్రానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, బోరబండ, రాంగోపాల్‌పేట్‌, డోమల్‌గూడ పోలీస్‌స్టేషన్లలో ఒక్కో కేసు నమోదైంది. చిలకలగూడలో రెండు కేసులు, ఓల్డ్‌సిటీలో మరో రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ వైద్యుల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు, వైద్య పరికరాలు, మందుల సరఫరా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!