📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కామన్వెల్త్‌ గేమ్స్‌లో సైనికుల సత్తా..!

కామన్వెల్త్‌ గేమ్స్‌లో సైనికుల సత్తా..!

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌–2026లో భారత పతకాల సాధనలో భారత సైనిక క్రీడాకారులు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ధీరజ్‌ సేథ్‌ సైనిక క్రీడాకారులతో ప్రత్యేకంగా సమావేశమై వారి ప్రతిభను అభినందించారు. విజేతలను ఘనంగా సత్కరించారు.

39 పతకాల్లో ఆర్మీ వాటా 16
కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణ, 17 రజత, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత ఆర్మీకి చెందిన 15 మంది క్రీడాకారులు 16 పతకాలు సాధించారు.

13 స్వర్ణాల్లో.. 8 ఆర్మీ క్రీడాకారులవే!

భారత్‌ సాధించిన 13 స్వర్ణ పతకాల్లో ఏకంగా 8 స్వర్ణాలు ఆర్మీ క్రీడాకారులవే. దీంతో దేశ పతకాల పట్టికలో సైనిక క్రీడాకారుల ప్రాధాన్యం మరోసారి స్పష్టమైంది.

బాక్సింగ్‌ నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌ వరకు

బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌, పారా అథ్లెటిక్స్‌, జూడో, వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగాల్లో ఆర్మీ క్రీడాకారులు పతకాలు సాధించారు. వారి విజయాలను అభినందించిన జనరల్‌ ధీరజ్‌ సేథ్‌.. క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో దేశానికి కీర్తి తీసుకొచ్చిన క్రీడాకారులను ప్రశంసించారు.

సరిహద్దుల్లోనే కాదు.. క్రీడల్లోనూ

భారత సైన్యం సరిహద్దుల రక్షణతో పాటు క్రీడా రంగంలోనూ ప్రతిభను ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను తీర్చిదిద్దుతూ.. క్రీడల్లోనూ భారత కీర్తిని ఇనుమడింపజేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!