మంత్రి స్వాగతానికి వచ్చారు..
చైన్ పోగొట్టుకున్నారు!
రూ.7 లక్షల విలువైన బంగారు చైన్ చోరీ
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మంత్రి స్వాగత కార్యక్రమంలో చైన్ చోరీ కలకలం రేపింది.
ఆరోగ్య మంత్రి నిశాంత్ కుమార్ స్వాగత కార్యక్రమానికి వచ్చిన జేడీయూ నేత
రాజేశ్ మండల్ మెడలోని సుమారు రూ.7 లక్షల విలువైన బంగారు చైన్
గుంపులో మాయమైంది.
తుర్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సక్రీ చౌక్ వద్ద మంత్రి స్వాగతానికి పెద్ద సంఖ్యలో
నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రి కారు అక్కడికి చేరుకోగానే ఆయనకు మాలలు
వేయడానికి, బొకేలు అందించడానికి పలువురు ముందుకు వచ్చారు. ఈ సమయంలోనే
రాజేశ్ మండల్ మెడలోని బంగారు చైన్ కనిపించకుండా పోయింది.
మెడలోని రూ.7 లక్షల చైన్ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన నేత
చైన్ కనిపించడం లేదని గుర్తించిన రాజేశ్ మండల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చైన్ సుమారు 34 గ్రాముల బరువు ఉంటుందని, దాని విలువ దాదాపు
రూ.7 లక్షలు ఉంటుందని సమాచారం.
ఘటనపై తుర్కీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్వాగత కార్యక్రమానికి సంబంధించిన
వీడియోలు, సమీపంలోని CCTV ఫుటేజ్‌ను పరిశీలిస్తూ చైన్ చోరీకి
పాల్పడిన వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
చోరీకి గురైన చైన్ మంత్రి నిశాంత్ కుమార్‌ది కాదు.
మంత్రి స్వాగత కార్యక్రమానికి వచ్చిన జేడీయూ నేత
రాజేశ్ మండల్‌ది.

