📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeరాజకీయంబాధిత కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సాయం

బాధిత కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సాయం

కామారెడ్డి, జూలై 12 (నవజ్యోతి ప్రతినిధి):

జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన చింతాల రమేష్, ఎస్సీ కాలనీకి చెందిన మున్సిపల్ కార్మికురాలు సైదుగాని దుర్గవ్వ కుటుంబాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యం చెప్పారు.

 

అనంతరం రమేష్, దుర్గవ్వ కుటుంబాలకు కలిపి మొత్తం రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని అన్నారు. కష్టకాలంలో ప్రజలకు తోడుగా ఉండడమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా అవసరమైన ప్రతి సందర్భంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బబ్లు, కాంగ్రెస్ నాయకులు అమీర్, స్వామి, ప్రశాంత్, మహబూబ్, రాములు, మున్సిపల్ కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!