📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తూప్రాన్ : కుక్క కాటు.. నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడు!

తూప్రాన్ : కుక్క కాటు.. నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడు!

రేబిస్‌ సోకి 24 ఏళ్ల యువకుడు మృతి.. కుటుంబంలో తీవ్ర విషాదం
మనోహరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (నవజ్యోతి ప్రతినిధి నవీన్‌):
కుక్క కాటును చిన్న విషయంగా తీసుకున్న ఓ యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
కుక్క కరిచిన తర్వాత రేబిస్‌ టీకా తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో వ్యాధి సోకి
24 ఏళ్ల సురేష్‌ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
ఈ ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పరికిబండ గ్రామపంచాయతీ పరిధిలోని
తుపాకులపల్లి గ్రామంలో విషాదం నింపింది.

మూడు నెలల క్రితం కుక్క కాటు

తుపాకులపల్లి గ్రామానికి చెందిన కాషా రాములు–లలిత దంపతుల కుమారుడు సురేష్‌ (24)
మూడు నెలల క్రితం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కుక్క కరిచింది.
అయితే కుక్క కరిచిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి రేబిస్‌ టీకా తీసుకోలేదు.

కొందరు గ్రామస్తుల సలహాతో చెట్ల మందు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కుక్క కాటు తర్వాత వైద్య చికిత్స తీసుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేయడం
పరిస్థితిని విషమంగా మార్చింది.

ప్రవర్తనలో మార్పు.. ఆసుపత్రికి తరలింపు

రోజులు గడిచేకొద్దీ సురేష్‌ ప్రవర్తనలో మార్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే రేబిస్‌ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు సురేష్‌ను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చిన్న నిర్లక్ష్యం.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది!

గ్రామంలో విషాద ఛాయలు

అందరితో కలివిడిగా ఉండే సురేష్‌ ఆకస్మికంగా మృతి చెందడంతో తుపాకులపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది.
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కుక్క కాటును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి
అవసరమైన చికిత్స, టీకాలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.

కుక్క కాటు విషయంలో నిర్లక్ష్యం వద్దు

  • కుక్క కరిచిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  • గాయం చిన్నదే అని భావించి నిర్లక్ష్యం చేయకూడదు.
  • వైద్యుల సూచన మేరకు రేబిస్‌ టీకాలు తీసుకోవాలి.
  • ఇంటి చిట్కాలు లేదా శాస్త్రీయ ఆధారం లేని చికిత్సలపై ఆధారపడకూడదు.
  • ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలి.
ముఖ్య గమనిక: రేబిస్‌ లక్షణాలు కనిపించిన తర్వాత వ్యాధి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.
అందుకే కుక్క లేదా ఇతర అనుమానాస్పద జంతువు కరిచినప్పుడు లక్షణాల కోసం వేచి ఉండకుండా
వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అత్యంత కీలకం.
— నవజ్యోతి ప్రతినిధి నవీన్‌
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!