ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో కార్యవర్గం ఎన్నిక.. నూతన కమిటీకి అభినందనలు
భిక్కనూర్, ఆగస్టు 23 (నవజ్యోతి ప్రతినిధి):
టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్‌రెడ్డి , మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి
సమక్షంలో లక్ష్మీదేవునిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని
ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఏనుగు తిమ్మారెడ్డి ఎన్నికయ్యారు.
📌 నూతన కార్యవర్గం
ఉపాధ్యక్షులుగా ఆలకుంట నర్సింలు, మాగిని ఎల్లయ్య,
ప్రధాన కార్యదర్శిగా ఏనుగు నాగిరెడ్డి, కోశాధికారిగా
ఆత్మకూరు లింభారెడ్డి ఎన్నికయ్యారు.
సహాయ కార్యదర్శులుగా పుల్లూరు భూమయ్య, కొట్టాల మైపాల్‌రెడ్డి
బాధ్యతలు చేపట్టారు.
👥 సలహాదారులుగా..
సలహాదారులుగా ఏనుగు లింగారెడ్డి, జిల్లాల బాపురెడ్డి,
గడ్డం ఇంద్రారెడ్డి, మాగిని మల్లయ్యలను ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.
నూతన కార్యవర్గ సభ్యులను
ఇంద్రకరణ్‌రెడ్డి , నరేందర్ రెడ్డిలు అభినందించారు.

