📄 ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హైడ్రా.. వన్స్ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్!

హైడ్రా.. వన్స్ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్!

రెండేళ్లుగా 400 గజాల ప్రజా స్థలం కోసం పోరాటం.. రంగంలోకి దిగిన హైడ్రా
హైదరాబాద్, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి):

హయత్‌నగర్‌ సాహెబ్‌నగర్‌ ఆఫీసర్స్‌ కాలనీలో 400 గజాల ప్రజా స్థలం పరిరక్షణ కోసం రెండేళ్లుగా స్థానికులు చేస్తున్న పోరాటానికి హైడ్రా అండగా నిలిచింది. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులతో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సోమవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడేందుకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్‌ హామీ ఇచ్చారు.

400 గజాల స్థలం.. రెండేళ్ల పోరాటం

1987లో రూపొందించిన లేఅవుట్‌లో ప్లాట్‌ నంబర్లు 39, 40లను ప్రజా సౌకర్యాల కోసం కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం 400 గజాల ఈ స్థలాన్ని పార్కు, ఇతర ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సి ఉండగా.. ప్రైవేటు నిర్మాణాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రెండేళ్లుగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా స్థలం కోసం పోరాడుతున్న స్థానికులను నిర్మాణదారులు బెదిరించారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. బెదిరింపులకు సంబంధించిన వీడియోలను చూసిన తర్వాతే తాను స్వయంగా స్థలాన్ని పరిశీలించానని రంగనాథ్‌ తెలిపారు.

వివాదం ఎలా మొదలైంది?

లేఅవుట్‌ను నిర్వహిస్తున్న సొసైటీ 45 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ అధికారి దానిని రద్దు చేసినట్లు హైడ్రాకు సమాచారం అందింది.

సొసైటీ రద్దయినప్పటికీ.. 2023లో ప్రజా సౌకర్యాల కోసం కేటాయించిన రెండు ప్లాట్లను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

అనుమతి G+1.. నిర్మాణం నాలుగు అంతస్తులా?

ప్రస్తుత నిర్మాణదారులు G+1 భవనానికి అనుమతి పొందినప్పటికీ.. అనుమతులకు విరుద్ధంగా నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థల యాజమాన్యంపై వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే నిర్మాణం కొనసాగించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా స్థలంపై హక్కుల వివాదం కొనసాగుతుండగానే నిర్మాణం ముందుకు వెళ్లడంపై హైడ్రా దృష్టి సారించింది.

ప్రజా స్థలాల విషయంలో రాజీ లేదు

కాలనీకి చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు ప్లకార్డులతో హైడ్రా కమిషనర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. ప్రజా స్థలాలు, పార్కులు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రంగనాథ్‌ స్పష్టం చేశారు.

ప్రజా స్థలాన్ని కాపాడేందుకు భూమి హక్కులు, నిర్మాణ అనుమతులు, ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పిస్తామని హైడ్రా కమిషనర్‌ తెలిపారు.

కోర్టుకు పూర్తి నివేదిక

స్థలానికి సంబంధించిన రికార్డులు, హక్కులు, భవన అనుమతులు, నిర్మాణ ఉల్లంఘనల వివరాలను సేకరించి కోర్టు ముందుంచనున్నట్లు హైడ్రా తెలిపింది. అక్కడ జరిగిన అనధికార నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

రెండేళ్లుగా ప్రజల పోరాటం..
ఇప్పుడు హైడ్రా ఎంట్రీ..ప్రజా స్థలం విషయంలో ‘హిస్టరీ రిపీట్’ అవుతుందా?

హైడ్రా.. వన్స్ స్టెప్ ఇన్!
ప్రజా స్థలాల పరిరక్షణలో మరోసారి యాక్షన్ మొదలైంది.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!