📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బోనం సమర్పించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి !

బోనం సమర్పించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి !

నల్ల పోచమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు

ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ఆరే కటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు కూడా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

పాల్గొన్న ప్రముఖులు

మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ, మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మా ఎజాజ్, కౌన్సిలర్ కటికే రమేష్, నార్ల సురేష్, కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!