కీసర, జూలై 29,(నవజ్యోతి ప్రతినిధి) :
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కల్తీ పన్నీర్ రవాణాపై ఎస్వోటీ ఉక్కుపాదం
మల్కాజిగిరి కమిషనరేట్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కల్తీ పన్నీర్‌ను పట్టుకున్నారు. చర్లపల్లి నుంచి నాగారం శ్రీకాకుళం బస్తీ వైపు రెండు ఆటోల్లో తరలిస్తున్న కల్తీ పన్నీర్‌పై సమాచారం అందడంతో
RELATED ARTICLES


పోలీసులు వెంటనే దాడి నిర్వహించారు.ఎస్వోటీ బృందం ఆటోలను వెంబడించి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డగించి స్వాధీనం చేసుకుంది. సుమారు 400 నుంచి 600 కిలోల వరకు అనుమానాస్పద కల్తీ పన్నీర్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.స్వాధీనం చేసుకున్న ఆటోలను, పన్నీర్‌ను కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కల్తీ పన్నీర్ ఎక్కడ తయారైంది, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఉన్న ముఠా ఎవరు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.