అమెరికాలో హెచ్–1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో భారత ఐటీ పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే తాజా చర్యలు పరిశ్రమను పూర్తిగా ఊహించని స్థితిలోకి నెట్టలేదని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రముఖ భారత ఐటీ సంస్థలు ఇప్పటికే కొత్త హెచ్–1బీ ఉద్యోగులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించాయి. అదే సమయంలో అమెరికాలో స్థానిక నియామకాలు, భారత్ సహా ఇతర దేశాల్లో సేవల నిర్వహణను పెంచాయి.
కొత్త హెచ్–1బీ అనుమతులు భారీగా తగ్గాయి
నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ విశ్లేషణ ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏడు అతిపెద్ద భారతీయ ఐటీ సంస్థలకు కొత్త ఉద్యోగాల కోసం ఆమోదమైన హెచ్–1బీ పిటిషన్లు 4,573గా ఉన్నాయి.
ఈ గణాంకాలు కొత్త, అదనపు ఉద్యోగాల కోసం ఆమోదాలను సూచిస్తాయి. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల వీసా పొడిగింపులు ఇందులో ప్రధానంగా ఉండవు.
ప్రముఖ కంపెనీల్లోనూ ఇదే పరిస్థితి
| సంస్థ | 2023 | 2024 | 2025 |
|---|---|---|---|
| టీసీఎస్ | 1,174 | 1,452 | 846 |
| కాగ్నిజెంట్ | 2,597 | 2,873 | 743 |
| హెచ్‌సీఎల్ అమెరికా | 715 | 1,248 | 379 |
| ఎల్‌టీఐమైండ్‌ట్రీ | 914 | 798 | 401 |
అమెరికా టెక్ కంపెనీలకు మాత్రం భారీ సంఖ్య
కొత్త హెచ్–1బీ ఉద్యోగుల విషయంలో అమెరికా టెక్ కంపెనీలు ముందంజలో ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్‌కు 4,644, మెటాకు 1,555, మైక్రోసాఫ్ట్‌కు 1,394, గూగుల్‌కు 1,050 కొత్త ఉద్యోగాల కోసం పిటిషన్ అనుమతులు లభించాయి.
దీంతో అమెరికా టెక్నాలజీ రంగానికి నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల అవసరం కొనసాగుతున్నప్పటికీ.. భారత ఐటీ సేవల సంస్థలు గతంలో ఉన్న స్థాయిలో కొత్త హెచ్–1బ

