📄 ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బ్రేకింగ్ న్యూస్ : రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో దారుణం.. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు!

బ్రేకింగ్ న్యూస్ : రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో దారుణం.. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు!

ప్రేమ వ్యవహారంలో కేసు నమోదు చేశారంటూ ఆందోళన.. రామాయంపేట పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకునే క్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయాలు
మెదక్‌, సెప్టెంబర్‌ 07 (నవజ్యోతి ప్రతినిధి):
మెదక్‌ జిల్లా రామాయంపేట పోలీస్‌ స్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుర్గాప్రసాద్‌ అనే యువకుడు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారంలో తనపై కేసు నమోదు చేసి పోలీసులు వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ అతడు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మంటలతోనే పోలీస్‌ స్టేషన్‌లోకి..

పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న అనంతరం దుర్గాప్రసాద్‌ పోలీస్‌ స్టేషన్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.

అడ్డుకునే క్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయాలు

యువకుడిపై మంటలను ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ దామోదర్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం.

వెంటనే గాయపడిన వారికి వైద్య చికిత్స అందించే చర్యలు చేపట్టారు.

యువకుడి పరిస్థితి విషమం

తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ప్రేమ వ్యవహారమే కారణమా?

ప్రేమ వ్యవహారానికి సంబంధించి తనపై కేసు నమోదు చేశారని, పోలీసులు వేధిస్తున్నారంటూ దుర్గాప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, కేసు నేపథ్యం, పోలీసుల చర్యలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

రామాయంపేట పీఎస్‌లో కలకలం

పోలీస్‌ స్టేషన్‌లోనే యువకుడు నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. యువకుడి పరిస్థితి, హెడ్‌ కానిస్టేబుల్‌ గాయాల తీవ్రతతో పాటు ఘటనకు అసలు కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

నవజ్యోతి డెస్క్‌: ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!