📄 ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాళ్లకు.. కడుపుకు ప్యాకెట్లు కట్టి హషీష్‌ ఆయిల్‌ తరలింపు !

కాళ్లకు.. కడుపుకు ప్యాకెట్లు కట్టి హషీష్‌ ఆయిల్‌ తరలింపు !

రూ.1.5 కోట్ల విలువైన డ్రగ్‌ స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్‌
హైదరాబాద్, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి):

హషీష్‌ ఆయిల్‌ను కాళ్లు, కడుపుకు కట్టుకుని తరలిస్తున్న ఆరుగురిని ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, వనస్థలిపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 12 కిలోల హషీష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

డ్రగ్‌ను శరీరానికి కట్టుకుని తరలిస్తున్న నలుగురు క్యారియర్లను పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరు బాల నేరస్తులు ఉన్నారు.

కిలో చొప్పున ప్యాకెట్లు.. శరీరానికి టేప్‌తో

అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్‌ మీదుగా బెంగళూరుకు హషీష్‌ ఆయిల్‌ తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు చింతల్‌కుంట సమీపంలో తనిఖీలు చేపట్టారు. నలుగురు క్యారియర్లు ఒక్కొక్కరు 3 కిలోల చొప్పున డ్రగ్‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఒక్కో క్యారియర్‌ రెండు కాళ్లకు చెరో కిలో, కడుపుకు మరో కిలో చొప్పున ప్యాకెట్లను కట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మొత్తం 12 కిలోల హషీష్‌ ఆయిల్‌, ఐదు మొబైల్‌ ఫోన్లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిరుద్యోగ యువతే టార్గెట్‌?

ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీను గతంలోనూ గంజాయి, హషీష్‌ ఆయిల్‌ అక్రమ రవాణా కేసుల్లో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత చింతపల్లి ప్రాంతానికి చెందిన కృష్ణ, బెంగళూరుకు చెందిన సిజోతో కలిసి మళ్లీ దందా కొనసాగించినట్లు ఆరోపించారు.

శ్రీను, అతని భార్య నిబియా పొరుగున ఉన్న గ్రామాల్లోని నిరుద్యోగ గిరిజన యువతకు సులభంగా డబ్బు సంపాదించే అవకాశం ఉందంటూ ఆశ చూపి డ్రగ్‌ క్యారియర్లుగా ఉపయోగించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

రూ.10 లక్షలకు డీల్‌?

ప్రస్తుత 12 కిలోల హషీష్‌ ఆయిల్‌ను బెంగళూరుకు చేర్చేందుకు సిజో రూ.10 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు శ్రీను, నిబియా, మరో నలుగురు చింతపల్లి ప్రాంతంలోని సరఫరాదారు కృష్ణ నుంచి సరుకు తీసుకుని హైదరాబాద్‌ మీదుగా బెంగళూరు వెళ్తుండగా పట్టుబడ్డారు.

కృష్ణ సరఫరాదారుగా, సిజో ప్రధాన రిసీవర్‌గా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరూ పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

డ్రగ్‌ సరఫరా గొలుసుపై దర్యాప్తు

డ్రగ్‌ సరఫరా గొలుసులో ఉన్న మరికొందరి కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

డ్రగ్స్‌ అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతర చర్యలు కొనసాగిస్తున్నామని మల్కాజ్‌గిరి పోలీసులు తెలిపారు.

డ్రగ్స్‌పై నిఘా కట్టుదిట్టం

డ్రగ్స్‌ విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు. డ్రగ్స్‌ సరఫరా గొలుసును ఛేదించడమే లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

కాళ్లకు.. కడుపుకు డ్రగ్స్‌ ప్యాకెట్లు..

రూ.1.5 కోట్ల హషీష్‌ ఆయిల్‌ పట్టివేత..

ఆరుగురు పోలీసుల అదుపులో!

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!